జగిత్యాల రూరల్ (మం) లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య (జాన్) అనే వ్యక్తి బతికి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చిన ఇందయ్య 2009తో సొంత భూమి కొనుగోలు చేసి ₹8 లక్షలతో సమాధిని నిర్మించుకున్నాడు. ఇందయ్య నిన్న కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఆయన నిర్మించుకున్న సమాధి వద్దనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.