ఆదివాసీ ఆత్మబంధువులకు ఘన నివాళులు
NEWS Jan 11,2026 07:44 pm
మర్లవాయిలో ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులకు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, ఎంపీ గోడం నగేష్ ఘనంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ తన సతీమణి బెట్టి ఎలిజబెత్‌తో కలిసి ఆదివాసీ ప్రాంతాలకు వచ్చి, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులపై లోతైన పరిశోధనలు చేసి, ఆదివాసుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని వక్తలు కొనియాడారు. ఆదివాసీ సమాజం ఆయన సేవలను ఎన్నటికీ మరువదన్నారు.