మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన రిసెర్చ్ చేసి, పరిశోధించి వాటిని అనుసరించారు. జపాన్ ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి పవన్‌కు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు.