పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో ముగ్గుల పోటీలు సందడిగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండారి త్రివేణి – అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులు వేశారు. సామాజిక సందేశాలు ప్రతిబింబించేలా రూపొందించిన రంగవల్లులు గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళల సృజనాత్మకత, ప్రతిభను గ్రామ ప్రజలు హర్షాతిరేకాలతో అభినందించారు. పోటీల సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొని, ఉల్లాసం ఉత్సాహంతో కళకళలాడింది.