మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సంబరాలు
NEWS Jan 13,2026 09:28 am
పాల్వంచ: చిరంజీవి, నయనతార, వెంకటేష్ నటించిన మన శివ శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన సందర్భంగా ఖాసిం పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ నందు ముందుగా పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పెదబాబు ఖాసీం, లగుపతి, స్వామి, బ్రహ్మం, మస్తాన్, భాను, వీరు, రామక్రిష్ణ, నాగరాజు, బాలాజీ, దేవా, భాషా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.