భోగి, సంక్రాంతి, కనుమ తేదీలు ఇలా..
NEWS Jan 13,2026 09:42 am
భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే భోగిగా భావిస్తారు. అదే రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం శుభంగా చెబుతున్నారు. దీంతోనే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తర్వాతి రోజు 15న సంక్రాంతి కాగా జనవరి 16న కనుమ పండుగ ఉంటుంది.