తెలంగాణ జిల్లాల మార్పుపై రగడ
NEWS Jan 13,2026 09:50 am
తెలంగాణ జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి సీఎం కెసిఆర్ జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.