హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.