తొలి విడతలో 128 గ్రామాల సర్పంచులకు శిక్షణ
NEWS Jan 15,2026 07:07 pm
పెద్దపల్లి జిల్లా లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లకు రెండు విడతలుగా ప్రభుత్వం శిక్షణ అందించనుంది. ఇందులో ఈ నెల 19 నుండి 23 వరకు మొదటి విడత, రెండో విడత ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ఇవ్వనున్నారు. జిల్లా మొత్తం సర్పంచ్ లకు పెద్దపల్లి మండలం లోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో అందించనున్నారు. మొదట విడత లో కమాన్ పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండల సర్పంచ్ లకు అందించనున్నారు.