బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. 59 మంది పాల్గొన్న ఈ ముగ్గులు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీ చైతన్య స్కూల్ వ్యవస్థాపకులు రాంబి ఆరిపాక జగన్ మాస్టారు వ్యవహరించారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి బెజవాడ శ్రావణి 2 వ బహుమతి S. పద్మ 3వ బహుమతి కావ్యకి గ్రామ నాయకులు బహుమతులు అందజేశారు. పాల్గొన్న అందరికి పార్టిసిపేషన్ ప్రైజ్ లు అందజేశారు. గ్రామ నాయకులు సాంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.