తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల కోడిపందాలను చూడడానికి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి జనం వస్తున్నారు. పందెం కోళ్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. జాతి కోళ్లకు ₹ 30 వేల నుంచి ₹3 లక్షల వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా కత్తులు కట్టి నిర్వహించే పందేల కోసం పందెం రాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వాహకులు విజేతలకు బుల్లెట్ బైకులు, కార్లను బహుమతులుగా ప్రకటిస్తూ పందెగాళ్లను ఆకర్షిస్తున్నారు.