జనవరి 16న సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. 676 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజీని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్మల్ పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం హాజరయ్యే బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని, రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను DCC నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెడ్మ బొజ్జు ఆదేశించారు.