నాను మహారాజ్ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
NEWS Jan 15,2026 07:09 pm
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బండ్రేవ్ తండా గ్రామంలో ప్రసిద్ధ నాను మహారాజ్ ఆలయాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. నాను మహారాజ్ ఆలయ 33వ జాతర ఉత్సవాలను మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు.