ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అధికారిక పర్యటన కావడంతో బహిరంగ సభకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.