నారావారిపల్లెలో ఫ్యామిలీతో కలిసి సీఎం చంద్రబాబు సందడి
NEWS Jan 15,2026 12:35 pm
AP: సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ, రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజస్విని, నారా రోహిత్, సిరి తదితరులు పాల్గొన్నారు.