సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
NEWS Jan 16,2026 12:04 am
నిర్మల్ జిల్లా: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం బాల్యపు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గాజులపేట్‌లోని తన నివాసంలో ఇవాళ జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నాయకులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, భావితరాలకు పండుగ సంప్రదాయాలను అందించాలని, అందరూ ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలన్నారు.