‘బలగం’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎల్లమ్మ’ మూవీని అనౌన్స్ చేశాడు వేణు యెల్దండి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా ‘ఎల్లమ్మ’ మూవీ గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ఎల్లమ్మ’ పండగ, మేకపోతు నీళ్లు విదిలించడం, రక్తమొడుతున్న కాళ్లకు గజ్జెలతో ఒకరు, బూట్లతో ఒకరు పరుగెడుతున్న దృశ్యాలు, తుఫాన్.. ఆ తర్వాత డప్పు పట్టుకుని కూర్చున్న దేవీశ్రీ ప్రసాద్ స్టన్నింగ్‌గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతోంది మూవీ.