ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!
NEWS Jan 17,2026 09:50 am
TG: మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి SEC అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ బల్దియా, వార్డులు ఏయే వర్గాలకు రిజర్వ్ అయ్యాయో తుది ప్రకటన వెలువడనుంది. అటు ఎన్నికల్లో పాల్గొననున్న ఇండిపెండెంట్ల కోసం నిన్న 75 గుర్తులను ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. కాగా ఇటీవల సర్పంచ్ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.