ఎన్టీఆర్ వర్ధంతి: నివాళుల కార్యక్రమం
NEWS Jan 18,2026 04:54 pm
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో ఆయన విగ్రహానికి అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేదలకు రూ.2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన మహానేతగా కొనియాడారు.