మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: ఎస్సై గంగాధర్
NEWS Jan 19,2026 09:37 pm
మెట్ పల్లి ఆర్టీసీ డిపో ప్రాంతంలో ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురు మైనర్లు పట్టుబడగా, వారికి ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.