రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
NEWS Jan 20,2026 03:05 pm
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులు నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్ని బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్‌గా గుర్తించారు. ఈ నలుగురు హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.