భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు
NEWS Jan 20,2026 03:04 pm
సమ్మక్క, సారక్క జాతర సమీపిస్తున్న వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. చలి తీవ్రత ఉన్నప్పటికీ ఉదయం నుంచి కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ఉప ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు ప్రసాద కౌంటర్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.