పెద్దపల్లిలో హాట్ హాట్ రాజకీయాలు
NEWS Jan 20,2026 03:08 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్, రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంకా ఎన్నికల కోడ్ కూడా రాకముందే.. వార్డులన్నింటా ఆశావహులు పోటీకి సిద్ధమవుతూ, జనాలను ఆకట్టుకునే కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రత్యేకంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో పరిస్థితి మరింత హాట్‌గా మారింది. మహిళలకు చీరలు, ఇంటింటికి గడియారాలు పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ స్థాయిలో పంపిణీలు మొదలవడంపై పట్టణమంతా చర్చ జరుగుతోంది.
“ఇప్పుడే ఇంతైతే… కోడ్ వచ్చినాక ఇంకెంత చేస్తారో” అంటూ మున్సిపల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి… మున్సిపల్ పోరు అధికారికంగా మొదలు కాకముందే రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది అన్నది పట్టణవాసుల మాట.