మెట్‌పల్లి: వృద్ధురాలిపై దుండగుల దాడి
NEWS Jan 20,2026 01:49 pm
మెట్‌పల్లి పట్టణంలోని చాకలి రేవు వద్ద బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వృద్ధురాలిని తీవ్రంగా కొట్టి, ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు చోరీ చేశారు. దాడిలో తలకు తీవ్రమైన గాయాలు కావడంతో రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధురాలి కుమారుడు రవి ముఖానికి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన మెట్‌పల్లి పట్టణంలో కలకలం రేపింది.