కొండగట్టుకు వెళ్లే దారిలోని ఓ కాలువలో మంగళవారం క్వాలిస్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన శివరాత్రి సురేష్ అతని కుటుంబ సభ్యులతో అంజన్న దర్శనానికి వెళ్తుండగా జేన్టీయు సమీపంలో క్వాలిస్ బ్రేక్ లు ఫెయిల్ అయి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కరీంనగర్, జగిత్యాల ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.