బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
NEWS Jan 20,2026 02:51 pm
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ నేత నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 45 ఏళ్ల వయసులో ఈ పదవిని స్వీకరించిన ఆయన బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆయన పార్టీకి 12వ జాతీయ అధ్యక్షుడు. బిహార్‌లో 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గతంలో బిహార్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించారు. ఇప్పటివరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది.