జనవరి 19న APS RTC రికార్డు!
NEWS Jan 20,2026 03:03 pm
AP: సంక్రాంతి పండగ వేళ APSRTC రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలో ఒక్కరోజులో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. జనవరి 19న రూ.27.68 కోట్ల రాబడిని సాధించింది. ఆ రోజు మొత్తం 50.60 లక్షల మందిని గమ్యాలకు చేర్చింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చింది. డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బందికి ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు.