ఇబ్రహీంపట్నం ఎస్సైగా జి.నవీన్ కుమార్
NEWS Jan 20,2026 06:09 pm
ఇబ్రహీంపట్నం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు జి.నవీన్ కుమార్. బదిలీలో భాగంగా కథలాపూర్ ఎస్సైగా పనిచేస్తున్న నవీన్ కుమార్ ను ఇబ్రహీంపట్నంకు, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ ను మల్లాపూర్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని నూతన ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.