పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన SP
NEWS Jan 20,2026 06:13 pm
నిర్మల్: పని ఒత్తిడిని తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ రెండు రోజుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. జిల్లా పోలీసు సిబ్బంది రెండు జట్లుగా ఏర్పడి ఉత్సాహంగా మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి అప్పుడప్పుడు ఆటవిడుపు అవసరమని, క్రీడలు మానసిక ఉత్సాహాన్ని పెంచుతాయని అన్నారు. ప్లేయర్లు అందరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు.