నిర్మల్ మున్సిపాలిటీ BJP కైవసం చేసుకోవాలి
NEWS Jan 20,2026 06:14 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సమష్టిగా కృషి చేసి నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసే విధంగా సమాయత్తం కలవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సుపరిపాలనను, విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని చెప్పారు.