ఘనంగా వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం
NEWS Jan 20,2026 06:15 pm
నిర్మల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మందిరంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గోపూజ అనంతరం వాసవి మాతకు అభిషేకం చేశారు. అనంతరం 18 కన్నెపిల్లలకు మంగళ స్నానం, హోమం ఆలయ శిఖరాభిషేకం జరిగింది. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.