ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ ఫైర్
NEWS Jan 20,2026 06:27 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ ఇచ్చిన సిట్ నోటీసు పూర్తిగా “ట్రాష్” అని విమర్శించారు. సిట్ అధికారులు ప్రశ్నలు అడగకుండానే గంటల తరబడి సమయం వృథా చేశారని ఆరోపించారు. ఎన్ని సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. రేవంత్ బావమరిది కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు.