పెండింగ్ చలాన్లు కట్టమని బలవంతపెట్టొద్దు!
NEWS Jan 20,2026 10:40 pm
HYD: పెండింగ్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు స్వచ్ఛందంగా ఉండాలే తప్ప బలవంతంగా వసూలు చేయరాదని, చలాన్లు చెల్లించనప్పుడు నోటీసుల జారీనే చట్టబద్ధ మార్గమని కోర్టు వ్యాఖ్యనించింది. ”పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు. పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దు. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలి. చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలి” అని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది హైకోర్టు.