మేడారం జాతరకు వెళ్లే మహిళలకు శుభవార్త
NEWS Jan 20,2026 10:55 pm
ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మేడారం సందర్భంగా తిప్పనున్న ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జాతర కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. మేడారం జాతర కోసం రాష్ట్ర నలుమూలల అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ప్రకటించారు. వీటన్నిటిలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు.