అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మధ్య తోపులాట చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టే విషయంలో ప్రొటోకాల్‌పై వివాదం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మధ్య తోపులాట జరిగింది.