బాసర అమ్మవారిని దర్శించుకున్న గరికపాటి
NEWS Jan 21,2026 01:11 pm
వసంత పంచమి వేడుకల్లో భాగంగా సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ప్రవచనాలు చేశారు. ఆలయ ఈవో, ఆలయ వైదిక బృందం ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమని గరికపాటి అన్నారు.