హరీశ్ రావు ఫ్యామిలీ ఫోన్లు ట్యాపింగ్?
NEWS Jan 21,2026 01:04 pm
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హరీశ్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘2018 ఎన్నికల తర్వాత మీ ఫోన్, మీ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హరీశ్ షాక్‌కు గురై ‘ఇది మీరు సృష్టించారా?’ అని అడిగారని, పోలీసులు ట్యాప్ అయిన తేదీలు చెబుతూ ఆధారాలు చూపించారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.