HYD: బెస్ట్ రీల్ కు రూ.10,000
NEWS Jan 21,2026 01:32 pm
హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల పరిధిలోని 500కు పైగా వీకెండ్ స్పాట్స్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో FTCCI నిర్వహిస్తున్న మెగా రీల్స్ కాంటెస్ట్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. పాత కోటలు, జలపాతాలు, ఫేమస్ దాబాల అందాలను 60 సెకన్ల రీల్‌గా చిత్రీకరించి పంపాలి. ఉత్తమ రీల్స్‌కు రూ.10,000 వరకు నగదు బహుమతులు అందిస్తారు. తెలంగాణ టూరిజాన్ని వైరల్ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.