నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క
NEWS Jan 21,2026 02:58 pm
ఆదివాసీల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధి చెందిన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోభ ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో నాగోభ దేవతకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. నాగోభ దేవత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి సీతక్క ప్రార్థించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేస్లాపూర్ నాగోభ దేవాలయం ప్రతీకగా నిలుస్తోందని, ఇలాంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.