బొమ్మేన గ్రామంలో దొంగలు బీభత్సం
NEWS Jan 21,2026 06:53 pm
కథలాపూర్ మండలం బొమ్మేన గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బాలె లాస్య, బాలె కళావతి, బాలె లలిత చెందిన 3 కుటుంబాల వారు ఇతర పనుల నిమిత్తం మరో గ్రామానికి వెళ్లగా ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కాగా బాలె లాస్య ఇంటిలోని మూడున్నర తులాల బంగారం, 3 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.