కేజ్ వీల్స్ తో రోడ్లపైకి రావొద్దు
NEWS Jan 21,2026 06:57 pm
రైతులు పొలం పనుల్లో భాగంగా ట్రాక్టర్ యజమానులు కేజ్ వీల్స్ తో రోడ్లపైకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్ ఐ మల్లేష్ హెచ్చరించారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పటికీ మండల వ్యాప్తంగా 12 ట్రాక్టర్ లను సీజ్ చేసి జరిమానా విధించామని, కేజ్ వీల్స్ తో రోడ్ల పై వస్తే గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, సహకరించాలని కోరారు.