కాంగ్రెస్ బీఫారం కోసం బోడ రోజా దరఖాస్తు
NEWS Jan 21,2026 07:00 pm
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్వంచ పరిధిలోని 6 జనరల్ డివిజన్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ బీ ఫారం కోసం ఇంద్రనగర్ కాలనీకి చెందిన బోడ భరత్ సతీమణి బోడ రోజా దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత అయిత గంగాధర్ రావు ఆధ్వర్యంలో పార్టీ ఇంచార్జి తాలూరి బ్రహ్మయ్యకు అప్లికేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకల రంగారావు, డీసీసీ చైర్మన్ కొత్వాల శ్రీను, సీనియర్ నేత ఊకంటి గోపాలరావు పాల్గొన్నారు. యువతకు అవకాశాలు కల్పించాలని నేతలు అన్నారు.