ముగిసిన పోలీస్ క్రికెట్ టోర్నీ
NEWS Jan 21,2026 07:01 pm
రెండు రోజులపాటు నిర్వహించిన నిర్మల్ జిల్లా పోలీసు శాఖ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగిసింది. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బైంసా టీం విజయం సాధించింది. గెలిచిన జట్టుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీస్ క్రికెట్ కప్ అందజేశారు. ఈ మ్యాచ్‌ను పోలీసు కుటుంబాలు ఆసక్తిగా తిలకించాయి. పని ఒత్తిడి తగ్గించేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు అవసరమని ఎస్పీ తెలిపారు.