రికార్డు స్థాయిలో రూపాయి పతనం
NEWS Jan 21,2026 10:56 pm
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి భారీగా నష్టపోయి, ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌లో నెలకొన్న పలు ప్రతికూల పరిణామాల మధ్య ఒక్కరోజే 77 పైసల మేర విలువను కోల్పోయింది.