మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
NEWS Jan 22,2026 09:32 am
ములుగు: మేడారంలో హెలికాప్టర్ సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ ఈ సేవలను అందిస్తుంది. పడిగాపూర్ హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల జాయ్ రైడ్ కు రూ. 4800, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి మేడారానికి రానుపోను ఛార్జీ రూ. 35,999గా నిర్ణయించారు. ఈ సేవలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ నెల 31 వరకు కొనసాగుతాయి.