అందరి సమష్టిగా కృషి చేయాలి:
ఎమ్మెల్యే విజయ రమణ రావు
NEWS Jan 22,2026 04:37 pm
పెద్దపల్లి మున్సిపల్‌లో జరగనున్న ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తిర్రి శ్రీలత - రాజేందర్‌లు పెద్దపల్లి గౌడ సంఘం పెద్దలతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను ఎవరిని నియమించినా పార్టీ విజయం కోసం అందరి మద్దతు, సహకారం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఐక్యతతో ముందుకు సాగితే మున్సిపల్‌లో ఘన విజయం సాధించవచ్చని ఆయన తెలిపారు.