మోత మోగిస్తున్న 'విజిల్' గుర్తు!
NEWS Jan 22,2026 11:34 am
తమిళగ వెట్రి కళగం (TVK ) పార్టీకి ఎన్నికల సం ఘం ఎన్నికల గుర్తుగా 'విజిల్'ను కేటాయించింది. దీంతో ఆ పార్టీ అధినేత విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన 'మన టీఆర్ఎస్ పార్టీ'కి కూడా 'విజిల్'ను గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో 'మన TRS' పార్టీ అధినేత టైగర్ అశోక్ పోతు ఆనందం వ్యక్తం చేస్తూ విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఇటు తెలంగాణలో, అటు తమిళనాట 'విజిల్' గుర్తు మోత మోగించడం ఖాయమన్నారు.