కార్పొరేటర్ బరిలో జగన్నాధం శాంతిరాజు
NEWS Jan 25,2026 04:38 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జగన్నాథం శాంతిరాజు బరిలోకి దిగుతున్నారు. ఇందిరా నగర్ కాలనీ పరిధిలోని సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ఆయన, స్థానిక ప్రజలకు అండగా నిలుస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. డివిజన్ అభివృద్ధి, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.