డివిజన్ కార్పొరేటర్ బరిలో చెరుకు భాగ్యలక్ష్మి
NEWS Jan 25,2026 10:14 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో త్వరలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4వ డివిజన్ కార్పొరేటర్‌గా బీజేపీ అభ్యర్థిగా చెరుకు భాగ్యలక్ష్మి బరిలోకి దిగారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పోటీలో ఉన్నట్లు తెలిపారు. డివిజన్‌లోని సమస్యల పరిష్కారంలో ముందుండి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.