నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
NEWS Jan 25,2026 05:48 pm
ఊర్కొండ: నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లెలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఆడుకొనేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ప్రాణాలు విడిచారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన వారిని మధు సిరి(14), స్నేహ, శ్రీమన్యు (11)గా గుర్తించారు. ఊర్కొండ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.